విజేత,దేవరపల్లి :తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీచర్గా పనిచేస్తున్న దేవరపల్లి కి చెందిన పల్లి కొండ విజయ రవికుమార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యారు. శనివారం రాజమహేంద్రవరం ఆనం కళాక్షేత్రంలో ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్నారు ఈ సందర్భంగా స్కూల్ హెచ్ఎం. ఉపాధ్యాయులు. సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు రవికుమార్ మాస్టర్ కు అభినందనలు తెలియజేశారు