Logo
Date of Publish : 19 June 2026, 10:16 am
Editor : B. Anil Kumar

రాష్ట్ర హోం మంత్రి అనిత పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ

మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌ పై
చర్యలకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఇండియా కూటమి మహిళా నేతల ఫిర్యాదు

రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పై మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచితి వ్యాఖ్యలకు తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎన్డీఏ కూటమి మహిళా విభాగం నేతలు..

(ప్రత్యేక ప్రతినిధి)
విజేత నక్కపల్లి, పాయకరావుపేట :
రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ మహిళా విభాగం నేతలు పలువురు నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు.ఈ మేరకు కూటమి మహిళా విభాగం నేతలు ఫిర్యాదు పత్రాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళికి అందజేశారు.
ఈ సందర్భంగా కూటమి పార్టీ మహిళా విభాగం నేతలు మాట్లాడుతూ హోం మంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యా మించడం పట్ల మహిళ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర హోం మంత్రిగా
ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా ప్రజాప్రతినిధిపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని హితువు పలికారు.మహిళల మనోభావాలను, ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన గుడివాడ అమర్నాథ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు
మల్లపురెడ్డి రమా కుమారి,ఎస్. రాయవరం ఎంపీపీ వెంకటలక్ష్మి, ఆ పార్టీ నక్కపల్లి మహిళా విభాగం అధ్యక్షురాలు మున్నిషా బేగం, ఎస్.రాయవరం మండల మహిళా విభాగం అధ్యక్షురాలు
కొమ్మిరెడ్డి నాగలక్ష్మి, జిల్లా టీడీపీ కార్యదర్శి వెంకటలక్ష్మి సహా ఆ పార్టీ మహిళా విభాగం నేతలు గుడబంటి శాంతమ్మ, దుబాసి జ్యోతి, జనసేన పార్టీ మహిళా విభాగం శ్రేణులు పద్మ, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )