బోయపాడు తీరంలో పెద్ద ఎత్తున చేపల మృతి
ఘటనపై తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి
పార్టీ శ్రేణులతో సంఘటన స్థలాన్ని సందర్శించిన జనసేన నేత బుజ్జి
ఘటనపై స్థానిక మత్స్యకారులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన శ్రేణులు
విజేత,నక్కపల్లి : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోయపాడు సముద్ర తీరంలో పెద్ద ఎత్తున చేపల మృతి ఘటనపై జనసేన పార్టీ పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి తీవ్రంగా స్పందించారు.ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు సహా పార్టీ శ్రేణులతో కలిసి ఆదివారం ఉదయం ఆయన సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆ తర్వాత జనసేన నేత బుజ్జి బోయపాడు తీరంలో జరిగిన ఘటనపై స్థానిక మత్స్యకారులతో చర్చించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక మత్స్యకారులు పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలు,ఇబ్బందులను జనసేన నేత గెడ్డం బుజ్జికి వివరించారు. ప్రధానంగా రాజయ్య పేట వద్ద ఇటీవల ఏర్పాటుచేసిన హెటిరో మందులు పరిశ్రమ ద్వారా విడుదలవుతున్న కలుషిత వ్యర్థ జలాలను పైప్ లైనింగ్ ద్వారా సముద్రంలో మిలితం చేయడం వల్లనే సముద్రంలోని మత్స్య సంపద మృత్యువాతపడడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయన్న విషయాన్ని మత్స్యకారుల పలువురు జనసేన నేత బుజ్జి దృష్టికి తీసుకువచ్చారు. మత్స్యకారుల వేదనపై తీవ్రంగా స్పందించిన జనసేన నేత బుజ్జి ఈ విషయాన్ని ఉన్నపళంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.ఇక్కడ జరిగిన సంఘటన గురించిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన మీదట దీనిపై ఆయన తీవ్రంగా స్పందించినట్లు తెలిపారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని జనసేన శ్రేణులతో వచ్చి పరిశీలించినట్లు తెలిపారు.ఇప్పటికే ఈ సంఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అనిత స్పందించినా మీదట సముద్రతీరంలో చేపల మృత్యువాత ఘటనపై తక్షణం పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి తెలియజేశారు.తాము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, పరిశ్రమలు ఉపాధి అవకాశాలతో పాటు అభివృద్ధికి దోహదపడతాయని అంటూ ఆయన పర్యావరణ పరిరక్షణతో పాటు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతినకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు.అభివృద్ధి సహా పర్యావరణ పరిరక్షణ రెండూ సమతుల్యంగా పాటిస్తూ ముందుకు సాగాలని రసాయన పరిశ్రమ యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.చేపల మరణాలకు గల అసలు కారణాలను సంబంధిత విభాగల నిపుణులు శాస్త్రీయంగా నిర్ధారించిన మీదట ప్రజలకు స్పష్టత ఇవ్వాలని, నష్టపోయిన మత్యకారులకు తగిన న్యాయం చేయాలని జనసేన పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట నక్కపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెలగా సుధాకర్ రావు,ప్రధాన కార్యదర్శిబిశ్యామ్, కార్యదర్శి గణపతి,ఆ పార్టీ నాయకులు ఉమా,గుర్రన్న, నూకరాజు, కోదండరాం, అమలకంట హరి, కొండబాబు,స్వామి, మత్స్యకారులు పలువురు పాల్గొన్నారు.