Logo
Date of Publish : 29 July 2026, 2:08 pm
Editor : B. Anil Kumar

పేట పట్టణంలో విస్తృతంగా “ఇంటింటికి టీడీపీ

పట్టణ టీడీపీ అధ్యక్షులు యాళ్ళ వరహాలు బాబు సారధ్యంలో నేతల విస్తృత ప్రచారం

విజేత,పాయకరావుపేట :రాష్ట్ర టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమంలో భాగంగా టిడిపి శ్రేణులు పాయకరావుపేట పట్టణంలో బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.రాష్ట్ర హోం,విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి వంగలపూడి అనిత ఆదేశాల మేరకు,పట్టణ పార్టీ అధ్యక్షులు యాళ్ళ వరహాలుబాబు ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామివారి గుడి వెనక గల 67వ బూత్ లో టీడీపీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వo చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్లా విలియం కేరి సహా పట్టణ టీడీపీ కేడర్ గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ శాఖ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు
రానున్న కాలంలో పార్టీ చేపట్టే అభివృద్ధి,సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ శాఖ అధ్యక్షులు యాళ్ల వరహాల బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో
యూనిట్ కన్వీనర్ పెదిరెడ్డి శ్రీను,పిఎల్ పురం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గూటూరు శ్రీను, సీనియర్ నాయకులు జూరెడ్డి ప్రసాద్,మండల తెలుగు యువత అధ్యక్షులు గొల్లపల్లి నాగు,యూనిట్ ఇన్చార్జిలు వేములపూడి అప్పారావు,రాజన ఆది, బూత్ ఇన్చార్జిలు పల్లా శ్రీను, మంజులూరీ దుర్గాప్రసాద్,యర్ర నరేష్,గొడపర్తి భాస్కర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )