ఆకాశ్ అంబానీ చేతికి రిలయన్స్ పగ్గాలు ?
30-12-2021
128
రిలయన్స్ ఇండస్ట్రీస్ లో నాయకత్వ మార్పు జరగబోతుంది. నెక్ట్స్ జనరేషన్ చేతికి రిలయన్స్ పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారు ముఖేశ్ అంబానీ. ఈ విషయాన్ని రిలయన్స్ వ్యవస్థాపకులైన ధీరూభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే 'రిలయన్స్ ఫ్యామిలీ డే' లో ప్రస్తావించారు.
రిలయన్స్ ఛైర్మన్ గా ఆకాశ్ అంబానీని ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలోనే అత్యంత విలువైన కంపెనీని ఇకపై ఆకాశ్ ముందుండి నడిపించనున్నట్లు సమాచారం.
ముఖేశ్ అంబానీ, నీతా దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు(ఆకాశ్, అనంత్), కూతురు(ఈశా) ఉన్నారు. వారిలో ఆకాశ్, ఈశాలు కవలలు.
గొప్ప కలలను, అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సాకారం చేసుకోవాలంటే సరైన వ్యక్తులు, సరైన నాయకత్వంతోనే సాధ్యమవుతుందని ఫ్యామిలీ డే పార్టీలో ముఖేశ్ వ్యాఖ్యానించారు. యువతరం చేతికి పగ్గాలు ఇస్తామని చెప్పారు. తాజాగా తనయుడికి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వ్యాపార వర్గాల ద్వారా తెలిసింది.