దుబ్బా తండాకు రావడం చాలా సంతోషంగా ఉంది* - సినీ హీరో సోను సూద్
18-01-2023
1142
*దుబ్బా తండాకు రావడం చాలా సంతోషంగా ఉంది*
- సినీ హీరో సోను సూద్
అక్షరవిజేత, తెలంగాణ బ్యూరో :
కరోన సమయంలో సినీ నటుడు సోను సూద్ చేసిన సేవలకు గుర్తుగా జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం దుబ్బా తండాలో సినీ నటుడు సోను సూద్ కు గుడి నిర్మించారని తెలుసుకున్న సోను సూద్ సమయం చూసుకొని తప్పకుండా దుబ్బా తండా కు వస్తా అని ఇచ్చిన హామీ ప్రకారం బుధవారం సోను సూద్ దుబ్బా తండా వచ్చారు. ఈ సందర్భంగా సోను సూద్ అక్షరవిజేత దిన పత్రిక తో మాట్లాడుతూ గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారని వారి ప్రేమ వెలకట్టలేనదని జీవితంలో మర్చిపోనన్నారు.కరోన సమయం లో నేను చేసిన సేవలకు గుడి కట్టడం నా అదృష్టం అని అలాంటి ఆత్మీయులను సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాక ప్రజలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని, ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్న సందేశం పంపిస్తే చాలు స్పందిచి అదుకుంటానని అక్షరవిజేతతో సోను సూద్ తన అనుభూతిని పంచుకున్నారు.