వేద పాఠశాల పై భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వెలంపల్లి

 12-01-2023     20*వేద పాఠశాల పై భవనాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి వెలంపల్లి* 


*అక్షరవిజేత, విజయవాడ*

స్థానిక 39డివిజన్లో కామకోటి నగర్ లో  నూతనంగా నిర్మించిన వేద పాఠశాల పై అంతస్తును మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు గురువారం నాడు  ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  గతంలోను ఈ పాఠశాల భవనాన్ని నేను 2019 లో ఎమ్మెల్యే గా వున్నా సమయంలో నా ఎమ్మెల్యే నిధులతో నిర్మించడం జరిగిందన్నారు.తిరిగి మల్లి దేవదాయ శాఖ మంత్రిగా ఉండగా సీజీఎఫ్ నిధుల నుండి 12 లక్షల రూపాయలు ఇచ్చి పై అంతస్తును నిర్మించడం జరిగిందన్నారు.వేద పాఠశాలలో విధ్యార్దులు మంచిగా చదువు కోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.బ్రాహ్మణుల అభివృద్ధికి కట్టుబడి వున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి,39వ డివిజన్ కార్పొరేటర్  గుడివాడ నరేంద్ర రాఘవ,డివిజన్ నాయకులు కార్యకర్తలు,వేద పాఠశాల పురోహితులు తదితరులు  పాల్గొన్నారు.


Latest News
more

Trending
more


Viewers
visit counter