రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిఖిల
19-01-2023
48
రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన
జిల్లా కలెక్టర్ నిఖిల
అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధి
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పూడూరు మండలం, చెన్గోమల్ గ్రామంలో స్థానిక శాసనసభ్యులు మహేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ నిఖిల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కంటి పరీక్షలు నిర్వహించి స్థానిక శాసనసభ్యులు మహేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల కంటి అద్దాలను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంధత్వ వ్యాధులను పూర్తి స్థాయిలో నిర్మూలించడంతో పాటు కళ్లల్లో కాంతులు నింపాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లాలో అర్హులైన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అక్కడికక్కడే మందులు, కళ్లద్దాలు అందజేయడం జరుగుతుందన్నారు. రెండో విడత కార్యక్రమం ప్రారంభం సందర్భంగా
జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. కంటి వెలుగు శిబిరంలో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్, ఆన్లైన్, కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాల పంపిణీకి సంబంధించిన టేబుల్స్‌ను శాసన సభ్యులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ సుధారాణి, స్థానిక తహసిల్దార్ మోహన్, ఎంపీడీవో ఉమాదేవి, ఎం పి ఓ సుందర్, వైద్య అధికారులు, గ్రామ సర్పంచ్ మల్లికా, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.