నిలకడగా గంగూలీ ఆరోగ్యం.. డాక్టర్ల ప్రకటన
28-12-2021
146
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యంపై వైద్యులు బులెటిన్ ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు మోనోక్లోనల్ యాంటీ బాడీలతో చికిత్స చేస్తున్నామని కోల్ కతాలోని వుడ్ ల్యాండ్స్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసూ ప్రకటించారు.
సోమవారం గంగూలీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయనను వుడ్ ల్యాండ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు డాక్టర్ దేవిశెట్టి, డాక్టర్ అఫ్తాబ్ ఖాన్ ల సలహాలు తీసుకుంటూ డాక్టర్ సప్తర్షి బసూ, డాక్టర్ సౌతిక్ పాండాల వైద్యుల బృందం చికిత్స చేస్తోందని రూపాలీ బసూ చెప్పారు. మందులను సమయానికి డోసులు వారీగా ఇస్తున్నట్లు తెలిపారు.