GOA DIARIES : ఎగిరి పోతే ఎంత బాగుందో అంటున్న సమంత  

 29-12-2021     403



మొన్నటి వరకు సమంత రెచ్చిపోతుంటే.. వెనక అక్కినేని ట్యాగ్ లైన్ కూడా ఉండేది. అయితే ఇప్పుడు దాన్నుంచి బయటికి వచ్చేసింది సమంత. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ పూర్తిగా కొత్త దారిలోకి వెళ్లిపోయింది. ఫ్రీ బర్డ్ లా ఎగిరిపోతుంది. ముఖ్యంగా తన స్నేహితురాళ్లతో కలిసి దేశమంతా తిరుగుతుంది. ఆలయాలతో పాటు బీచ్‌లలో కూడా ఎంజాయ్ చేస్తుంది.

తాజాగా ఈమె బికినీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. విడాకుల తర్వాత సమంత ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇదే మొదటి సారి. మరోవైపు సినిమాల్లోనూ బిజీ అవుతుంది సమంత. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లు అక్కడా ఇక్కడా రెండు చోట్లా రెచ్చిపోతుంది. ఎక్కడా తగ్గేదేలే అంటుంది.

sam

మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో సమంత ఐటం సాంగ్ ఎంతటి సంచలనం రేపిందో చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ గానే అందాలను ఆరబోసింది మాజీ అక్కినేని కోడలు. బయట కూడా ఇప్పుడు అదే స్థాయిలో రెచ్చిపోయింది. అదేంటని అడిగితే అంతా నా ఇష్టం అనేసింది.

నిజానికి చైతూతో ఉన్నప్పుడు కూడా సమంత రెచ్చిపోయింది. అందాల ఆరబోతతో అప్పుడు కూడా మాయ చేసింది. పెళ్లి తర్వాత కొన్ని రోజులు పద్దతిగా కనిపించిన సామ్.. ఆ తర్వాత మామూలు అయిపోయింది. చైతూతో టూర్స్ వెళ్లినప్పుడు అక్కడ్నుంచి బికినీ ఫోటోలు షేర్ చేసేది సమంత. ఇప్పుడు సోలోగా వెళ్లి అదే చేస్తుంది.

sam
విడాకుల తర్వాత నాణేనికి రెండో వైపు ఇంకా అలాగే ఉందని మరోసారి ప్రూవ్ చేసింది. హాట్ షోతో మతులు చెడగొట్టేసింది ఈ బ్యూటీ. నిజానికి ఈ మధ్యకాలంలో సమంత హాట్ షో చేసిన ప్రతీసారి అక్కినేని అభిమానుల నుంచి కామెంట్స్ కూడా వచ్చేవి. అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన లైఫ్.. తన ఇష్టం అన్నట్లు ఉంటుంది సామ్.

సినిమాల విషయంలో కూడా అదే చేస్తుంది. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా సమంత బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. సమంత క్లీవేజ్ షో చూస్తుంటే చలిలోనే చెమటలు పట్టడం ఖాయం.

sam
2021 చివరి రోజులు మధుర జ్ఞాపకంలా ఉండేందుకు తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకితో కలిసి ఇటీవల ఆమె గోవా వెళ్లారు. అక్కడి అద్భుతమైన లోకేషన్లలో వారంతా చిన్న పిల్లల్లా ఎంజయ్ చేశారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో సోషల్ మీడియా వేదికంగా అభిమానులతో పంచుకున్నారు. గోవా.. స్వర్గాన్ని తలపిస్తుందని సమంత పేర్కొన్నారు. ‘గోవా డైరీస్’  పేరిట షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

 

Attachments area


Latest News
more

Trending
more


Viewers
visit counter