సినిమా రామ సంకీర్తన*
09-04-2022
359
*సినిమా రామ సంకీర్తన*
ఆనంత గుణ శక్తి సంపన్నుడైన భగవంతుని దివ్యావతారాలలో దుష్టశిక్షణం శిష్టరక్షణం చేసేందుకై ఆవిర్బవించిన ప్రధానమైన మనవావతారం శ్రీరామావతారం మంచితనానికి మానవత్వానికి మధ్య మల్లెల వంతెన శ్రీరాముడు మానవీయ విలువకు గొప్ప ఉదాహరణం శ్రీరాముని చరితం. శ్రీరామ నవమి, శ్రీరామ కల్యాణం, శ్రీరామ నవరాత్రి ఉత్సవాలు, నిర్వహించడమంటే రాముని లోని ధర్మాన్నీ, సత్యాన్నీ ,ఆదర్శంగా గ్రహించి నీ బాటలో పయనిస్తా మనే మాటతో రామునికి కృతజ్ఞ
తలు భక్తితో తెల్పడమే ఈ పర్వ దిన స్పూర్తి. రామ నామము చీకటిని పటాపంచలు చేసే తారక నామము. అథమం పది గడపలున్న చిన్న పల్లెలో కూడా రామమందిరం వుండి తీరుతుంది. . రామదాసు ఎంతో రుచి రా... నీ నామం మరువం అన్నారు, త్యాగరాజుల వారు మారుగేలారా ఓ రాఘవా, నీ దయ రాదా రామా అని ఆలపించారు. సినీ కవులు కూడ తమ రచనలలో రామనామాన్ని రమ్యంగా రంగరించారు. శ్రీ ఆరుద్ర గారు రాయినైన కాక పోతిని రామ పాదము సోకగా అంటూ, శ్రీకరమయిన శ్రీ రామ నామామృతాన్ని తెలుగు వారికి పంచారు. వారు శ్రీ రామాంజనేయ యుద్ధం చలన చిత్రానికి గాను వ్రాసిన ఈ పాట ఎంతో మధురం. ఎన్నో ప్రసిద్ధిగాంచిన పాటలు వ్రాసిన ఆరుద్ర అంత్య అనుప్రాస తో రాసిన ఈ పాట వారి కీర్తి మకుటం లొనే ఓక కలికితురాయి. “శ్రీకరమౌ శ్రీ రామ నామం జీవామృత సారం. పావనమీ రఘురామ నామం భవ తారక మంత్రం. దధి క్షీరమ్ములకన్నా ఎంతో మధుర మధుర నామం! సదా శివుడు ఆ రజతాచలమున సదా జపించే నామం! కరకు బోయ తిరగేసి పలికినా కవిగా మలిచిన నామం! మరా మరా మరా మరా! రామ రామ రామ రామ! రాళ్లు నీళ్ల పై తేల్చిన నామం! రక్కసి గుండెల శూలం! వేయి జపాల కోటి తపస్సుల విలువ ఒక్క నామం! నిండుగ దండిగ వరములొసంగే రెండక్షరముల నామం! ఎక్కడ రాముని భజన జరుగునో అక్కడ హనుమకు స్థానం! చల్లని నామం మ్రోగే చోట చెల్లదు మాయాజాలం! తెలుగు వారికి సొంతమైన కళారూపంలో ఒకటి హరికధా ఇతిహాసాలలోని ప్రముఖ సంఘటనలను సంగీత సరళీలో సరళంగా తెలియజెప్పె ప్రక్రియ, ఈ ప్రక్రియ కి అనుకూలంగా వాగ్దానం చిత్రం కోసం శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) రచించిన సీతాకల్యాణం హరికధ సన్నివేశ, సందర్బ, సంగీత, పరంగా బహళ ప్రజాదరణపొందింది. జానపద శైలిలో పదాలను కొసరి కొసరి చెర్చి సంపూర్ణ రామాయణం చిత్రం కోసం కొసరాజు రచించిన రామయ్య తండ్రి అన్న పాట రామాయణ కధాసారాన్ని కమనీయంగా తనలో నింపుకుంది. జానపదులకు ఇతిహాసాలపై ఉన్న పట్టు భక్తి జానపదులకు ఇతిహాసాలపై ఉన్న పట్టు శ్రద్దాభక్తులకు తార్కాణం. విన్న వారి జీవితానికి ధన్యత చేకూర్చి జ్ఞానపధాన్ని ప్రసాదిస్తుంది. స్వాతి ముత్యం చిత్రం కోసం ఆత్రేయ రాసిన "రామా కనవేమిరా... రామా కనవేమిరా శ్రీ రఘురామ కనవేమిరా... రామా కనవేమిరా అన్న గీతం జానపద శైలిని సంప్రదాయ సంగీత శైలి మిశ్రమంగా సాగింది శివధనుర్బంగ సన్నివేశాన్ని సితా రాముల మనోభావాలని మనోహరంగా వర్ణించారు పడమటి సంధ్యా రాగం చిత్రంలో సన్నివేశానికి అణుగుణంగా చొప్ఫించిన పిబరే రామరసం అన్న కీర్తన శ్రోతలని ఆలరించింది మన పండుగలు , సంప్రదాయాలని మరువరాదని మృదువుగా హెచ్చరించింది. కాసుల కురిపించే కమర్షియల్ చిత్రంలో సైతం రామ నామం ప్రతిధ్వనించింది. శివమణి చిత్రం కోసం కందికొండ రచించిన గీతం చక్రి అందించిన సంగీతం శ్రోతలని మంత్ర ముగ్దులని చేసింది. యంత్ర యగంలో సైతం రామమంత్రానికి ఉన్న ప్రాముఖ్యతను చాటి చెప్పింది. సుగుణాభిరాముని కీర్తిస్తూ రామనవమి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకునే వైనాన్ని సుందరరాముడు కీర్తిస్తూ ఆల్లుడా మజాకా చిత్రంకోసం వ్రాసిన గీతం సుమనోహరం . రాములోరి కల్యాణం లోక కల్యాణం అబాల గోపాలానికి ఆ ఉత్సవం అమితానందోత్సవం. శ్రీమంతుడు చిత్రంలో రామజోగయ్య శాస్ర్తి రచించి దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన "హే రాములోడు వచ్చినాడురో దన్ తస్సదియ్య శివధనస్సు ఎత్తినాడురో అన్న గీతం నవీన నాగరికకులకు ఇతిహాస ఇతివృతాన్ని పరిచయం చేసి ఇహంలో పరం లో మనకి భక్తిని ముక్తిని ప్రసాదించేది తారకమత్రం అని ఉద్బోధ చేసింది సుగుణాభిరాముని సుగుణాలను అలవరుచుకొని ధర్మం కోసం లోకం కోసం పాటుపడమని ఉపదేశిస్తుంది. పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం. జనన మరణ భయ శోకవిదూరంసకల శాస్త్ర నిగమాగమ సారం శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం శుక శౌనక కౌశిక ముఖ పీతం పిబరే రామ రసం రసనే పిబరే రామ రసం.అంతా రామమయం ఈ జగమంతా రామమయం.
*శ్రీధర్ వాడవల్లి 9989855445*