MUST WATCH : అదరగొడుతున్న LIGER  వీడియో 

 29-12-2021     137



హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం లైగర్. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ కోసం వరుస అప్ డేట్స్ లైన్ లో పెట్టింది చిత్ర బృందం.

ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను బుధవారం విడుదల చేసింది. ది బిగ్ ఎనౌన్స్ మెంట్ అంటూ విడుదల చేసిన ఈ వీడయో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. డిసెంబర్ 30 గురువారం ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ని విడుదల చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్ ని విడుదల చేస్తామని చెప్పింది. ఇక ఫైనల్ గా డిసెంబర్ 31న లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నట్టు ఈ వీడియో ద్వారా ప్రకటించారు.

లైగర్ సినిమాను పూరీ జగన్నాథ్, నటి ఛార్మి కలిసి రూ.125 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు , హీరోయిన్ అనన్యపాండే టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. పూరీ జగన్నాథ్ తనదైన మార్క్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారట.

ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ఈ చిత్రం ద్వారా ఇండియన్ సినిమాకు పరిచయం కాబోతున్నారు. ఇప్పటి వరకు మైక్ టైసన్ ఏ భారతీయ చిత్రాల్లోనూ నటించలేదు. లైగర్ కోసం పూరీ మైక్ టైసన్ ను రంగంలోకి దింపారు. ఇటీవలె మైక్ టైసన్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. సినిమా కథను మలుపు తిప్పే పాత్రని అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.  అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం.. మైక్ టైసన్ వంటి వారు చిత్రంలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

 

వీడియో లింక్ ఇదిగో : https://twitter.com/i/status/1476052908969902080


Latest News
more

Trending
more


Viewers
visit counter