ప్రెస్ క్లబ్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ

 19-01-2023     72*ప్రెస్ క్లబ్ క్రీడా పోటీలు ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పీటీసీ.*

*అక్షర విజేత చిన్నంబావి*

చిన్నంబావి మండల కేంద్రంలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మండల ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి కెసిరెడ్డి వెంకట రమణమ్మ ప్రారంభించారు.
బుధవారం మండల పరిధిలోని అధికారులు, ప్రజాప్రతినిధులు జర్నలిస్టులు కలిసి ఫ్రెండ్లీ గేమ్స్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ, జడ్పిటిసి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నిత్యం వ్యక్తిగత జీవితం లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటామని, ఇలాంటి స్నేహపూర్వక క్రీడా పోటీలతో మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని, క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ప్రెస్ మిత్రులను వారు అభినందించారు.
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరు ముఖ్యపాత్ర వహించాలని అందులో జర్నలిస్టుల పాత్ర ప్రధానమైనదని అన్నారు. కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పెరుమాళ్ళ శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాకేష్, వివిధ గ్రామాల సర్పం


Latest News
more

Trending
more


Viewers
visit counter