సినిమాల్లోకి మిస్ యూనివర్స్ సోయగం-అతనితో నటించాలని-హర్నాజ్ సింధు

 29-12-2021     116



రెండు దశాబ్దాల తర్వాత భారత్ కు ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ కిరీటం అందించింది హర్నాజ్ సంధూ. తన అందం. సమయస్ఫూర్తితో సుస్మితా సేన్, లారా దత్తాల తర్వాత ఈ ఘనత సాధించిన బ్యూటీ క్వీన్ గా అరుదైన గుర్తింపు పొందింది. ఏమాత్రం అంచనాలు లేకుండా ఇజ్రాయెల్ వెళ్లిన హర్నాజ్ 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి మరీ ‘మిస్ యూనివర్స్-2021’ టైటిల్ సొంతం చేసుకుంది. కాగా ఈ అందాల పోటీలకు ముందే వెండితెరపై అడుగుపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది హర్నాజ్.

పోలీవుడ్ (పంజాబీ చిత్ర పరిశ్రమ)లో ‘బాయి జీ కుట్టంగే’ పేరుతో తెరకెక్కనున్న సినిమాలో ఆమె నటిస్తోంది. దీంతో పాటు ‘యూరన్ దియాన్ పో బారా’ అనే మరో పంజాబీ సినిమాకు కూడా అంగీకారం తెలిపింది హర్నాజ్. కాగా విశ్వసుందరి కిరీటం అందుకున్నాక వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది హర్నాజ్. ఈ నేపథ్యంలో తన అభిరుచులు, ఇష్టాయిష్టాల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది.

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా తన సినిమా కెరీర్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా బయోపిక్ లో నటించాలని ఉన్నట్లు పేర్కొంది. ప్రియాంక వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం తనతో పాటు చాలామందికి స్ఫూర్తినిస్తుందని.. అవకాశం వస్తే ఆమె జీవిత చరిత్రపై వచ్చే సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది.

అదేవిధంగా ఇటీవల విడుదలైన ఓ వీడియోలో కూడా ‘నాకు ప్రియాంక అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. ఆమె నుంచే జీవితానికి సంబంధించిన ఎన్నో పాఠాలను నేర్చుకున్నానని.. పీసీనే నాకు ఎప్పుడూ ఇనిస్పిరేషన్ అంటూ తెలిపింది. కాగా గతంలో ఐశ్యర్యారాయ్, సుస్మితా సేన్, ప్రియాంక చోప్రా, లారా దత్తా, మానుషి చిల్లర్ కూడా మోడలింగ్ ఆపై అందాల పోటీల్లో ప్రతిభ చాటిన తర్వాతే వెండితెరకు పరిచయమయ్యారు. 

 


Latest News
more

Trending
more


Viewers
visit counter