కొలిక్కిరాని కోర్టు భవనం

 25-01-2023     39*కొలిక్కిరాని కోర్టు భవనం* 

అక్షర విజేత బోథ్

నియోజకవర్గ కేంద్రానికి మకుటంగా నిలిచి తాలూకా కేంద్రాన్ని హుందాగా నడిపించిన  కోర్టు కాంప్లెక్స్ భవనం నేడు శిథిలావస్థకు చేరి అద్దె భవనంలో కొనసాగుతుంది  
జూనియర్ సివిల్ జడ్జి కం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బోథ్ నియోజకవర్గంలోని బోథ్, బజార్హత్నూర్, ఇచ్చోడా, సిరికోండ, నేరడిగొండ, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లు ఈ కోర్టు పరిధిలోనే ఉంటాయి సంవత్సరానికి దాదాపు 1,000 కి పైగా కేసులు ఈ కోర్టులో విచారణ చేపడతారు 
ఇంతకు మునుపు ఉన్న పాత కోర్టు భవనంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం, కోర్టు పేషీల కోసం హాజరైన వారికి అన్ని రకాల సౌకర్యాలు ఉండేవి ఇటు కోర్టులో పనిచేసే కార్యాలయ సిబ్బందికి కూడా సకల సదుపాయాలతో సొంత భవనంలో పనిచేసేవారు గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు భవనం శిథిలావస్థలోకి చేరడం, భవనం కొంత కుంగిపోవడం వల్ల ఇప్పటికే రెండుసార్లు అద్దె భవనాల్లోకి మారింది, శిథిలావస్థలో ఉన్న కోర్టు భవనం అసాంఘిక కార్యక్రమాలకు, పిచ్చి మొక్కలకు నిలయంగా మారింది  గ్రామపంచాయతీకి పక్కనే ఉన్న సిబ్బంది పట్టించుకునే పాపాన పోలేదు అని స్థానికులు వాపోతున్నారు 
   కోర్టు నూతన భవన అంశంపై న్యాయశాఖ మంత్రికి, స్థానిక శాసనసభ్యులకు పలుమార్లు విన్నవించిన ఇదిగో అదిగో అంటున్నారే తప్పితే సరైన హామీ ఇవ్వలేకపోతున్నారు 
ఇక ఆర్ అండ్ బి అధికారులు అయితే ఏడు కోట్లతో ప్రపోజల్ పంపించాము త్వరలోనే అంటూ సంవత్సరాలు గడుపుతున్నారు సరియైన సమాచారం సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆర్ అండ్ బి అధికారులపై విమర్శలు ఉన్నాయి  ఇకనైనా ప్రజాప్రతినిధులు ప్రజల సమస్యను తమ సమస్యగా భావించి కోర్టు భవనానికి శాశ్వత పరిష్కారం చూయించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు 

 *ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తాం* 
 
గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలకు, న్యాయశాఖ మంత్రికి విన్నవించాం, ముఖ్యమంత్రికి సైతం లేఖలు పంపించాం ఎటువంటి స్పందన లేదు పరిస్థితి ఇలాగే ఉంటే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తాం


Latest News
more

Trending
more


Viewers
visit counter