రాజమౌళి గురించి రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన తీరు...

 30-12-2021     133ఏపీ ప్రభుత్వం, తెలుగు సినిమా పరిశ్రమ మధ్య కొనసాగుతున్న టికెట్ల ధరల వివాదం నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. హాలీవుడ్ స్థాయిలో తీసే సినిమాల వల్ల తెలుగు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని చెప్పాడు. దేశంలో ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారని అన్నాడు. అందుకు రాజమౌళిని ఉదాహరణగా చూపిస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు.

రాజమౌళి లాంటి దర్శకుడు హాలీవుడ్ సినిమా బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువ ఖర్చుతో అదే స్థాయి టెక్నాలజీని ఉపయోగించి సినిమాలు తీశాడని, అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాడు. ఆ రోజుల్లో తెలుగు సినిమాకు ఉన్న కెపాసిటీని ఒక విజన్ తో బాహుబలి సినిమా తీసి అంతకు రెండు మూడింతలు ఎత్తుకు తీసుకెళ్లాడని అన్నాడు. సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే నిర్మాత నష్టపోయేవాడు. రాజమౌళి ఇమేజ్ దెబ్బతినేది. వాళ్లిద్దరికే నష్టం జరిగేదని చెప్పుకొచ్చాడు.

కానీ బాహుబలి సూపర్ సక్సెస్ తో ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని అన్నాడు. ఇది జాతీయ స్థాయిలో తెలుగు రాష్ట్రాల బ్రాండ్ ఇమేజ్ ని పెంచిందని అన్నాడు. దాన్ని ప్రభుత్వాలు ఎలా వెలకడతారని ప్రశ్నించాడు.

మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఏం రేంజ్ లో ఆదరిస్తారో రాజమౌళి నిరూపించాడు కాబట్టే పుష్ప తో పాటు మరికొన్ని పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. అంతకు ముందు వచ్చిన కేజీఎఫ్ ను కూడా ఉదాహరణగా చెప్పాడు. ఇటువంటి సినిమాల వల్ల ప్రభుత్వాలకు రెవెన్యూ పెరుగుతుందని... దీనివల్ల అందరూ లాభపడుతున్నారని చెప్పాడు. ప్రతి ఒక్కరూ బాహుబలి తీసిన డైరెక్టర్ ల్యాండ్ నుంచి వచ్చామని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఇది కేవలం బడ్జెట్ కు మాత్రమే సంబంధించింది కాదు..బ్రాండ్ వాల్యూ, ఫ్యూచర్, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇలా ఒకదానితో ఒకటి ముడి పడి ఉన్నాయన్నారు. ఇంకా చెప్పాలంటే టికెట్ ధరలు పెంచడం మానేసి.. రాజమౌళి లాంటి దర్శకులకు రివార్డులు ఇవ్వాలని, ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చి ఆయనను గౌరవించుకోవాలని సూచించాడు. తెలుగు సినీ పరిశ్రమకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొలవడం సమంజసం కాదని రామ్ గోపాల్ వర్మ అన్నాడు.


Latest News
more

Trending
more


Viewers
visit counter