బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాలయ్య

 29-04-2022     276బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బాలయ్య

అక్షరవిజేత,హైదరాబాద్:
అఖండతో బాక్సాఫీస్ తలుపులు బార్లా తెరిచిన బాలయ్య.. ఇప్పుడు గోపీచంద్ మలినేనితో మరో పర్‌ఫెక్ట్‌ యాక్షన్‌ డ్రామా చేస్తున్నారు.బాలయ్యకు మోకాలి సర్జరీ జరిగినట్టు వచ్చిన వార్తల్ని కొట్టిపారేస్తూ, అది జస్ట్ రెగ్యులర్ చెకప్ మాత్రమే అని క్లారిటీనిచ్చింది నందమూరి కాంపౌండ్. సారధీ స్టూడియోస్‌లో జరుగుతున్న తాజా షెడ్యూల్‌లో పార్టిసిపేట్ చేశారని, నో మోర్ ఫియర్స్ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. జూన్ 10న ఎన్‌బీకే 107 టీజర్ వస్తుందని, ఆగస్టులో అనిల్‌రావిపూడి సినిమా స్టార్ట్ అవుతుందని కూడా హింట్ ఇచ్చింది బాలయ్య క్యాంప్. ప్రస్తుతానికి ఎఫ్‌3కి ఫినిషింగ్ టచెస్ ఇస్తూ విక్టరీ హీరో వెంకీ లైనప్‌ని స్ట్రాంగ్‌గా డిజైన్ చేస్తున్నారు పటాస్ డైరెక్టర్ అనిల్. సమ్మర్‌ సీజన్‌లో రాబోయే నెక్స్ట్ థండర్ మూవీ వెంకీదే మరి. మరో సీనియర్ హీరో నాగార్జున… వైల్డ్‌డాగ్‌తో డీలా పడ్డప్పటికీ బౌన్స్‌బ్యాక్ మూవీ కోసం ట్రయల్ వేస్తూనే ఉన్నారు. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర, ప్రవీణ్‌సత్తారు యాక్షన్ అడ్వెంచర్ ‘ది ఘోస్ట్‌’…. బంగార్రాజు కెరీర్‌లో లేటెస్ట్ గోల్డెన్‌ లైన్స్‌.


Latest News
more

Trending
more


Viewers
visit counter