కేంద్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే బిఆర్ఎస్ యువ నాయకుడు అశోక్ ముదిరాజ్

 19-01-2023     66కేంద్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

బిఆర్ఎస్ యువ నాయకుడు అశోక్ ముదిరాజ్

అక్షర విజేత వికారాబాద్ ప్రతినిధి

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో గెలిచేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని బిఆర్ఎస్ యువనాయకుడు అశోక్ ముదిరాజ్ పేర్కొన్నారు. తెలంగాణలో అమలయ్యే ప్రతి పథకం దేశం మొత్తం అమలు చేసే సత్తా కెసిఆర్ కు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  తెలంగాణలో అమలు అయ్యే ప్రతి పథకం దేశం మొత్తం అమలు చేస్తామని అశోక్ తెలిపారు. దేశంలో ఎన్నో సహజ వనరులు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకునే సత్తా బిజెపికి లేదని సునీతమ్మ యువసేన సభ్యుడు అశోక్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుని దేశం అభివృద్ధి చెందే విధంగా కెసిఆర్ కృషి చేస్తారని తెలిపారు.


Latest News
more

Trending
more


Viewers
visit counter