ఏపీ సర్కార్ చేస్తుంది రాంగ్.. ఆర్జీవీ హాట్ కామెంట్స్ 

 29-12-2021     113ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు అని సంచలన దర్శకుడు ఆర్జీవీ అన్నారు. ఉత్పత్తిదారులకి ధర నిర్ణయించుకునే హక్కు ఉందన్నారు. కొనాలా వద్దా అనేది వినియోగదారుడు ఇష్టం. టికెట్ ధర ఎంత ఉన్నా నచ్చిన వాళ్లు చూస్తారన్నారు. నచ్చని వాళ్లు మానేస్తారు. సాధారణ కారు ధరకు బెంజ్ కార్ ఇవ్వాలంటే అంటే ఎలా..! అని అన్నారు. టికెట్ ధరలు తగ్గించడం ద్వారా ప్రభుత్వం కావాలనే ఇండస్ట్రీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందా, లేదా అనేది నాకు తెలియదని.. సినిమా టికెట్ ధరలు తగ్గించడం వల్ల హీరోలకు నష్టం ఏమీ లేదన్నారు. 

ఇలాంటి చర్యల ద్వారా అగ్రహీరోల ఆర్ధిక మూలాలను దెబ్బతీయడం అసాధ్యమన్నారు. ప్రభుత్వం ఏం చేసినా హీరోల పారితోషికం తగ్గటం అనేది అసాధ్యమని.. టికెట్ ధరలు తగ్గంచడం నిర్మాతలకు నష్టమన్నారు. ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే.. అని వర్మ అన్నారు. 

ఇక ఇదే సమయంలో ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆశ’ చిత్రానికి సంబంధించి మాట్లాడుతూ.. ‘‘రేపిస్టులు తాలుకు స్వభావం ఆ సమయంలో వాళ్లు ప్రవర్తించిన విధానం వారి సైకాలజీ ఎలా ఉంది అనే దానిపై ఫోకస్ ఉంటుందన్నారు. ఇది కల్పిత కథ అని.. అత్యాచారాల సమస్యలకు మూలం ఎక్కడుంది దానికి చట్టపరమైన శిక్షలు పరిష్కారం కాదు అనేది సినిమాలో చూపెట్టా’’ అని వర్మ తెలిపారు.  


Latest News
more

Trending
more


Viewers
visit counter