ALLU ARJUN: భావోద్వేగంతో  కంటతడి-తట్టుకోలేక ఏడ్చేసిన సుకుమార్

 28-12-2021     104స్టైలిస్ట్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారడానికి దర్శకుడు సుకుమార్ కారణమని హీరో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. సుకుమార్, ఆర్య లేకపోతే తాను ఈ స్థాయిలో  ఉండేవాడిని కాదని..  కన్నీళ్లను తుడుచుకుంటూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. అల్లు అర్జున్ మాట్లాడుతుంటే అక్కడే ఉన్న సుకుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. రెండు చేతులు ముఖానికి అడ్డుపెట్టుకుని కన్నీళ్లు తుడుచుకున్నారు.

అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన మాస్ యాక్షన్ చిత్రం 'పుష్ప' ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్బంగా హైదరాబాద్ లో  'పుష్ప థ్యాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం పనిచేసిన టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు.

' సుకుమార్ గురించి నేను ఎక్కువ చెప్పలేను. సుకుమార్ కూడా నా గురించి ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే మేమిద్దరం ఒకరితో ఒకరం చాలా సన్నిహితంగా ఉంటాం. పబ్లిక్ గా చెప్పాలన్నా సిగ్గుగా ఉంటుంది. పర్సనల్ విషయాలను పబ్లిక్ గా షేర్ చేయలేం. సుకుమార్ కూడా నాకు అంత పర్సనల్. కానీ ప్రపంచానికి సుకుమార్ గురించి తెలియాలి'.

'నా లైఫ్ సుకుమార్ ఉంటే ఒకలా ఉంది. లేకపోతే వేరేలా ఉండేది. ఇందులో ఏ మాత్రం అనుమానం లేదు. ప్రతి మనిషికీ 18-19 ఏళ్ల వయసులో జీవితంలో ఏం అవ్వాలన్న సందిగ్ధత ఉంటుంది. వారు ఎంచుకునే కెరీర్ బట్టి అది ముందుకు వెళ్తుంది. నేను సినిమాలు చేద్దామనుకున్నప్పుడు సుకుమార్ తో చేయడం వల్ల లైఫ్ ఇలా వచ్చింది. మరొకరితో చేస్తే ఇంకెలా ఉండేదో. ఒకటైతే చెప్పగలను ఐకాన్ స్టార్ వరకూ రాగలిగాను అంటే దానికి కారణం సుకుమార్'.

'నా లైఫ్ లో రుణపడి ఉంటానని చాలా కొంతమందికి మాత్రమే వాడతాను. తల్లిదండ్రులు, తాతయ్యకు, చిరంజీవికి.. తర్వాత సుకుమార్ కే. నాకు సుకుమార్ అంటే అంత ఇష్టమని నాకు తెలియదు. ఆర్య తర్వాత కొత్త కారు కొన్నాను. దాని ఖరీదు రూ. 85 లక్షలు. కారు పట్టుకుని స్టీరింగ్ పైన చేయి పెట్టి.. ఇందుకు కారణమైన వ్యక్తుల గురించి ఆలోచించాను.

అప్పుడు నా మైండ్ లో తట్టిన వ్యక్తి సుకుమార్ గారు. ' అని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యాడు. మాట్లాడటం ఆపేసి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారు. వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ..  'డార్లింగ్ నువ్వు లేకపోతే నేను లేను. ఆర్య లేదు. ఇంకేమీ లేవు. థ్యాంక్యూ డార్లింగ్ ' అన్నారు. సుకుమార్ కూడా ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగాన్ని కనిపించకుండా రెండు చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ ఇద్దరూ కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించారు. ' ప్రతీ సారి పబ్లిక్ లో కన్నీళ్లు పెట్టుకోవడం ఇదేంటి? ' అంటూ అల్లు అర్జున్ కళ్లను తుడుచుకున్నారు. ' ఇప్పుడైనా అర్ధమైందా నువ్వు ఎంత ముఖ్యమో ' అంటూ సుకుమార్ ని ఉద్దేశించి అల్లు అర్జున్ అంటున్న సమయంలో హాలులో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. మీట్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి వారు కూడా ఎమోషనల్ గా ఫీలయ్యారు.

'స్టార్ నుంచి స్టైలిస్ట్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ ని చేసి యావత్ భారతదేశం చూసేలా చేశారంటే నా కెరీర్ కు సుకుమార్ ఎంత కంట్రిబ్యూషన్ ఇచ్చారో మాటల్లో చెప్పలేను' అని అల్లుఅర్జున్ మాట్లాడారు.

అనంతరం మాట్లాడిన సుకుమార్ భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్య, పిల్లలకు ధన్యవాదాలు తెలుపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. చంద్రబోస్ గురించి మాట్లాడుతూ వేదికపైన ఉన్న ఆయనకు పాదాభివందనాలు చేశారు. 'పుష్ప' -2 తర్వాత 'పుష్ప' వెబ్ సిరీస్ చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. 'పుష్ప' సినిమా కోసం పనిచేసిన లైట్ బాయ్స్, స్పాట్ బాయ్స్, ప్రొడక్షన్ సిబ్బంది ఒక్కొక్కరికి రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


Latest News
more

Trending
more


Viewers
visit counter