Logo
Date of Publish : 24 September 2026, 3:10 pm
Editor : B. Anil Kumar

స్త్రీ జన్మనిస్తూ మరణించకూడదు

విజేత,నంద్యాల : ఏ స్త్రీ జన్మనిస్తూ మరణించకూడదు.. ఏ శిశువు మరణించేందుకు జన్మించకూడదు అని చంద్రన్న సంచారం చికిత్స కేంద్రం జిల్లా అధికారి డాక్టర్ జగదీశ్ చంద్ర రెడ్డి అన్నారు. మహానంది మండలం కేంద్రం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాతా, శిశు మరణాల నియంత్రణపై తీసుకోవాల్సిన చర్యలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైధ్యాధికారుల తో మరియు ఆరోగ్య కార్యకర్తలతో గురువారం సమావేశం నిర్వహించారు.గర్భిణులు, శిశువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు ప్రణాళికలను తయారు చేసుకోవాలన్నారు. నేడు జాతీయ నలిపురుగులు కార్యక్రమం గూర్చి ఆరోగ్య కార్యకర్తలకు తగు సూచనలు చేశారు. కుష్టు వ్యాధి నివారణ సర్వే గురువారంతో పూర్తి అయినది ఆరోగ్య ఆరోగ్య కార్యకర్త లకు తగుచూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఆరోగ్య కేంద్రం డాక్టర్ భగవాన్ దాస్, డాక్టర్ వేణు కార్తికేయ, ఎంపీహెచ్ఈఓ హుస్సేన్ రెడ్డి,పి హెచ్ ఎన్ ఆబినాబి, నరసింహారావు, గిడ్డమ్మ, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )