Logo
Date of Publish : 26 September 2026, 10:52 am
Editor : B. Anil Kumar

సీఎం.ఆర్.ఎఫ్ సాయం.. అనారోగ్య బాధితులకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది

• 116 మంది లబ్ధిదారులకు రూ.64.45 లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.

విజేత,చిలకలూరిపేట : ఖరీదైన వైద్యచికిత్సలు చేయించుకోలేని పేద, మధ్యతరగతి వర్గాలకు కూటమి ప్రభుత్వం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం.ఆర్.ఎఫ్) వారికి ఎంతగానో ఉపయోగపడుతోందని, అప్పులభారం లేకుండా అనారోగ్య సమస్యల నుంచి వారిని గట్టెక్కిస్తోందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 116 మంది లబ్ధిదారులకు రూ.64.45 లక్షల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, కుటుంబసభ్యులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు

ప్రభుత్వం అందించే సాయం.. ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుంది..

అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి అత్యవసర పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అందించే ఆర్థికసాయం వారికి కొండంత ధైర్యాన్ని, గొప్ప భరోసాను ఇస్తుందన్నారు. సీఎం.ఆర్.ఎఫ్. ఎల్.ఓ.సీ సాయం పంపిణీతో ప్రజా ప్రభుత్వం తమ వెంటే ఉందనే నమ్మకం ప్రజల్లో పెరుగుతుందని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఆయన ఆలోచనల నుంచి పుట్టిన సంజీవని ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యసేవలు ప్రజల ముంగిటకే రాబోతున్నాయని ప్రత్తిపాటి పేర్కొన్నారు.

కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, టీడీపీ నాయకులు ముల్లా కరిముల్లా, మురకొండ మల్లిబాబు, టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )