Logo
Date of Publish : 31 August 2026, 5:20 pm
Editor : B. Anil Kumar

మూడు దశాబ్ధాల స్వప్నం – సాకారమైన అపూర్వఘట్టం

విజేత,దర్శి ప్రతినిధి: మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు ప్రాంతాలు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం కలిగించే పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ప్రారంభోతవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అని దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. 1996 మార్చి 5న కొబ్బరికాయకొట్టి, శిలాఫలకం వేసిన చంద్రబాబు సరిగ్గా మూడు దశాబ్ధాల తర్వాత గుమ్మడికాయ కొట్టి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడం ఒక చారిత్రాత్మక కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టం గా భావిస్తున్నాను అని లక్ష్మీ అన్నారు. కృష్ణమ్మకు హారతి ఇచ్చి, పసుపు, కుంకుమ, చీర సమర్పించిన ఈ పవిత్ర కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. గిరిజన మహిళలు, చిన్నారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకడం ఆకట్టుకుంది. వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ప్రకాశం జిల్లా ముఖ్యంగా దొనకొండ, కురిచేడు మండలాల రైతుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చే చారిత్రాత్మక ఘట్టం. కృష్ణాజలాలతో ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు మరింత భరోసా కలగనుంది అని లక్ష్మీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డీబీవీ స్వామి, ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రాద్, పార్ధసారధి, ఎంపీ శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )