ముంపుప్రాంతాల్లో పర్యటించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఇంచార్జ్ తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి
విజేత,గాజువాక : భారీ వర్షాల కారణంగా 69వ వార్డు హరిజన జగ్గయ్యపాలెం, అయ్యప్ప నగర్ ప్రాంతాల్లో ముంపుకు గురైన ప్రాంతాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి , 69వ వార్డు అధ్యక్షులు బోగాది సన్యాసిరావు పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు.స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, ముంపు నీటి సమస్యలు తదితర అంశాలపై స్థానికులతో చర్చించారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పెట్లి అప్పారావు, పేకాట రమణ, నంది శివకుమార్, రవి, పెట్లి కనకరాజు తదితరులు పాల్గొన్నారు.