
విజేత (తాడేపల్లి గూడెం) పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: అభివృద్దే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తానని పెంటపాడు మండలం కూటమి తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అలంపూరం గ్రామానికి చెందిన తనబుద్ధి రవికిరణ్ పేర్కొనారు. జడ్పీటీసీ అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ ను జాయింట్ కలెక్టర్ కు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను జెడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు బొలిశెట్టి శ్రీనివాస్ కు కూటమి నాయకు లకు, బొలిశెట్టి రాజేష్, తోట రాజా, తోట రాజేష్‌లతో పాటు పెంటపాడు, అలంపూ రం గ్రామ ప్రజలకు కృతజ్ఞత లు తెలిపారు. తాను 2014 నుంచి ప్రత్యక్షంగా కాకపోయి నా పరోక్ష రాజకీయాల్లో నిరం తరం కొనసాగుతూ, ప్రతి ఎన్నికల్లోనూ గ్రామంలో ప్రజల కు అందుబాటులో ఉంటూ తనకి వీలైనంతగా సహాయ సహకారాలు అందిస్తున్నానని గుర్తుచేశారు. ఈసారి తన మిత్రుడు తోట రాజేష్ కోరిక మేరకు జనసేన తరుపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అవకాశా లు కల్పన కు కృషి చేస్తాన చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను సద్వినియో గం చేస్తూ ప్రతి ఒక్కరికీ చివరి వరకు అందేలా నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని 21 గ్రామాల్లో ఎటువంటి సమస్య ఉన్నా, ఏ క్షణమైనా ప్రజలు తనను సంప్రదించవచ్చని, వారి సమస్యలను పరిష్కరిం చడానికి తన వంతు శక్తివంచ న లేకుండా ప్రయత్నిస్తానని రవికిరణ్ స్పష్టం చేశారు.








