విజేత తాడేపల్లిగూడెం (పెంటపాడు) పశ్చిమ గోదావ రి జిల్లా బ్యూరో: నియోజక వర్గ పరిధిలోని పెంటపాడు మండలం పెంటపాడు ఎంపీ టీసీ-2 అభ్యర్థిగా జనసేన వీరమహిళ నాయకురాలు, ద్వారకాతిరుమల ఆలయ కమిటీ సభ్యురాలు కసిరెడ్డి మధులత నామినేషన్ దాఖ లు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంపీటీసీలను కనీసం నాయకులుగా కూడా గుర్తించలేని అసమర్థ పాలన సాగిందని, అందువల్లే ఐదేళ్ల పాటు ఎంపీటీసీలు నిధులు, అధికారాలు లేక ఉండిపోయా రని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పేదలకు నాయకత్వ అవకాశాలు కల్పి స్తూ పల్లెల అభివృద్ధికి బాట లు వేస్తోందన్నారు. గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పల్లెల ప్రగతికి ఎంతో కృషి చేస్తున్నారని, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయు డు, ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. తనకు పోటీ చేసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. తనకు వచ్చిన అవకాశంతో ప్రజలకు మరింత సేవ చేస్తానని అన్నారు. కార్యక్ర మంలో కూటమి నాయకులు పుల్లా బాబి, కిలపర్తి వెంకట్రా వు, దాసరి అప్పన్న, దత్తు ప్రసాద్, దాసరి కృష్ణవేణి, కొనగళ్ల హరినాథ్, సామినేని వెంకట సత్యవతి, కొవ్వూరు లక్ష్మారెడ్డి, చామన సురేష్, పాపారావు పాల్గొన్నారు.