Logo
Date of Publish : 24 September 2026, 3:07 pm
Editor : B. Anil Kumar

దుర్గా నగర్‌లో విరిగిపడ్డ కొండచరియలు..అప్రమత్తం అయిన అధికారులు

విజేత,గాజువాక: గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గా నగర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం ఉదయం కొండచరియలు విరిగిపడ్డాయి .కుండ పోత వర్షాల కారణంగా కొండ ప్రాంతంలోని మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారి కిందకు రావడంతో స్థానికులు భయందోళనకు గురైయ్యారు .ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, గాయాలు సంభవించక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ చింతా వాసు నాయుడు పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది సంఘటనా ప్రాంతంలో పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేసారు . భారీ వర్షాల నేపథ్యంలో కొండ ప్రాంతాల నివాసితులు ప్రమాదకర ప్రాంతాలవద్దకు ప్రజలు అనవసరంగా వెళ్లవద్దని పోలీసులు సూచించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


All Rights Reserved By www.aksharavijetha.com || www.epaper.aksharavijetha.com
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • ఈ -పేపర్
  • Reporters Apply
  • Reporters
  • Login

Designed By www.Webdigitalway.com
( 9052933264 )