విజేత ,దేవరపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దారితప్పి మేకల మందలో కలిసిన చుక్కల జింక. ఉదయం కుక్కల దాడి చేస్తుండగా స్థానికులు కుక్కల భారీ నుండి ఆ జింకను కాపాడి వైద్య చికిత్స అందించి పోలీసులకు ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని అందజేశారు. ప్రస్తుతం జింక ఆరోగ్యం బాగానే ఉందని స్థానికులు తెలియజేశారు.
