ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షునిగా కోడి రమేష్
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా కోడి రమేష్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ నియమించారు. ఈ మేరకు బుధవారం కోడి రమేష్ కు నియామక పత్రం అందజేశారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడిగా ఉన్న కోడి రమేష్ ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేశారు.తనపై నమ్మకంతో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జిల్లా అధ్యక్షులకు, రాష్ట్ర నాయకులకు అయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కొరకు అహర్నిశలు కృషి చేస్తానని రమేష్ తెలిపారు.కార్యక్రమంలో నాయకులు సురేష్, తదితరులు పాల్గొన్నారు.