జిల్లా నుండి కుటుంబ పాలనను తరిమికొట్టాలి
-ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్
-వంశీకృష్ణకు ఇక్కడి సమస్యలపై అవగాహన లేదు
-ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తా
అక్షర విజేత,మంచిర్యాల ప్రతినిధి:
కుటుంబ పాలన చేస్తున్న గడ్డం కుటుంబాన్ని ప్రజలు తరిమికొట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి తో కలిసి బజార్ ఏరియాలోని ప్రతి షాపుకు వెళ్ళి వ్యాపారస్తులను, ప్రజలను కలిసి బీజేపీకి ఓటు వేసి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం గత పది సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, పేద ప్రజల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిందని అన్నారు. స్థానిక వ్యక్తిగా ఇక్కడి ప్రజల కష్టాలు తనకు తెలుసునని, సింగరేణి కార్మికులు, రైతులు, దళిత సోదరులు పడుతున్న ఇబ్బందులు దూరం కావాలంటే బిజెపి కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు. తనను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. గడ్డం వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్లో చేసిన అభివృద్ధి ఏది లేదన్నారు. వారికి ఉన్న లక్షల కోట్లను కాపాడుకోవడానికి మరింతగా దోచుకోవడానికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ పోటీ చేస్తున్నాడే తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం ఆ కుటుంబానికి ఎప్పుడు లేదన్నారు.అలాంటి గడ్డం కుటుంబాన్ని పెద్దపెల్లి పార్లమెంటు నుండి తరిమి కొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. కుటుంబ పాలన అంతం కావాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించితే మంచిర్యాల జిల్లాలో మాత్రం మరొక కుటుంబం పాలించడానికి చూస్తుందని కాబట్టి జిల్లా నుండి కుటుంబ పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకట కృష్ణ, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా కార్యదర్శి మాసు రజిని, బెల్లంపల్లి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దార కళ్యాణి, ఉపాధ్యక్షురాలు సల్లం సుమలత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.