పంటలు సాగు చేసే రైతులు రోగ నివారణ చర్యలు చేపట్టాలి
అక్షర విజేత, మోర్తాడ్
బాల్కొండ నియోజకవర్గం ఏరుగట్ల మండలంలోని గుమ్మిరాల గ్రామంలో రైతులు సాగుచేస్తున్న వరి, నువ్వులు, సజ్జ పంటలను బుదవారం ఏరుగట్ల మండల వ్యవసాయ అధికారి ఏ.ఓ అబ్దుల్ మాలిక్ పంటలను పరిశీలించారు. సజ్జ పంటకు కత్తెర పురుగు సోకుతుందని, రైతులు వెంటనే కొరంట్రా నీలీ పోల్, 0.3 మిల్లీమీటర్ల మందులు తీసుకొని, ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి స్ప్రే చేయాలని, అదేవిధంగా నువ్వు పంటకు పీచు పురుగు ఆశిస్తుందని, వరి పంటకు సైతం సూడి దోమ రోగం సోకుతుందని, వెంటనే రోగ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు కచ్చితంగా అమలు చేస్తే, నివారణ చేసి అధిక దిగుబడులు రైతులుపొందవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఈ.ఓ. సాయి సచిన్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.