సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరింత కృషి చేస్తా
అక్షర విజేత, మోర్తాడ్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో సీ.ఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో మరింత అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మోర్తాడ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం రాత్రి రథోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ కాంగ్రెస్ నాయకులు ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, స్థానిక మోర్తాడ్ కాంగ్రెస్ నాయకులతో పాటు ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి, ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి వేద మంత్రాలు చదివి, శాలువలతో సన్మానించి, సెటగోపంతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ స్వామివారి కటాక్షంతో, పుష్కలంగా వర్షాలు కుర్యాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, అన్ని వర్గాల ప్రజలు పిల్ల పాపలతో, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, శ్రీ స్వామివారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. సీ.ఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల, సహకారంతో అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించేలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ గ్రామవృద్ధి కమిటీ అధ్యక్షులు జే.సీ గంగారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, మోర్తాడ్ గ్రామ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పల అశోక్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గిర్ మాజీ గోపి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బద్దం మైపాల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆరుగుల రమేష్, పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.