దేవరకొండలో వేసవి చలివేంద్రం ప్రారంభం…
అక్షరవిజేత, దేవరకొండ టౌన్
దేవరకొండ ఆర్టిసి బస్ స్టేషన్లో వాసవిక్లబ్, వాసవి వనిత క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో మెగా చలివేంద్రాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ ఆలపల్లి నరసింహ ప్రారంభించారు. ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు మాట్లాడుతూ. ప్రయాణికులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు నీల బిక్షమయ్య, పానుగంటి మల్లయ్య, వనిత క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.