బిజెపి చేతిలో కీలుబొమ్మగా మారిన సెన్సార్ బోర్డు
చరిత్రని వక్రీకరించి తీసిన రజాకార్ సినిమాని నిషేదించాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు డిమాండ్
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
నిజాం నియంతృత్వా నికి వెట్టిచాకారి విముక్తి కై కమ్యూనిస్టులు (*సిపిఐ * పార్టీ) నడిపిన మహోత్తర వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని నేడు వక్రీకరించి మతాలను రెచ్చగొట్టే విధంగా ఉందని రజాకార్ సినిమాను వెంటనే నిషేదించాలని తీసిన, తీయించిన వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జోగులాంబ గద్వాల జిల్లా సమితి డిమాండ్ చేసింది ఈ మెరకు బుధవారం నాడు జిల్లా కేంద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం జిల్లా కార్యదర్శి బి.ఆంజనే యులు మాట్లాడుతూ తెలంగాణాలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో సాగుతున్న దోపిడీ దౌర్జన్యాలకు వెట్టిచారికి దొర బాంచన్ నీ కాళ్ళు మొక్కుతా అనే దుర్మార్గలకు అణిచివేతకు అలాగే భూమి కోసం భూక్తి కోసం ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వన సాగిన మొహోత్తర సయుధ పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా పాల్గొని నిజాముల నాల్గున్నారా వేలమంది రక్తతర్పణంతో తరిమికొట్టారని పదిలక్షల ఎకరాల భూమిని పేదలకు పంచి,10వేల గ్రామాలను విముక్తి చేశారని అన్నారు. అలాంటి పోరాటాన్ని నేడు రజాకార్ సినిమా పేరు మీద బీజేపీ కనుసన్నుల్లో హిందువులకు ముస్లీంలకు యుద్ధంగా పేర్కొనడం సమాజంలో అశాంతిని నెలకొల్పడమే వారి ఉద్దేశం గా కనపడుతుందన్నారు. బీజేపీ రెచ్చగొట్టే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాదని, సినిమాని నిషేదించాలి. అలాగే హిందువులు ముస్లింలు ఎవరుకూడా రెచ్చిపోకుండా ఇది ఎన్నికల రాజకీయ కుట్రగా భావించి మతోన్మాద పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశం లో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పెరు కృష్ణ, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రవీణ్, సిపిఐ మండల ఇంచార్జి సుంకులమ్మ మెట్టు మహేష్,నాయకులు ప్రకాష్,ఏఐటీయూసీ నాయకులు నాగరాజు, పచ్చర్ల మురళి, ఏఐఎస్ఎఫ్ నరేష్, రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.