ఉచిత కంటి ఆపరేషన్
ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మాధురి
సిహెచ్ఓ చంద్ర ప్రకాష్
అక్షరవిజేత కుల్కచర్ల
జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో కుల్కచర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ మాధురి సి హెచ్ ఓ చంద్ర ప్రకాష్ ఒప్తాలమిక్ ఆఫీసర్ జవహర్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ వైద్య శిబిరంలో 32 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా అందులో 26 మంది శుక్లాల వ్యాధితో బాధపడుతున్నటు గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ లోని పుష్పగిరీ కంటి ఆసుపత్రికి పంపడం జరిగింది. వీరికి ఉచితంగా కంటి ఆపరేషన్ చెయ్యడమే కాకుండా, భోజనాలు అన్ని రకాల వసతులు కల్పిస్తూ మూడు రోజులు హాస్పిటల్ లోనే ఉంచుకొని కంటి అద్దాలు ఇచ్చి ప్రభుత్వ వాహనంలో కుల్కచర్ల హాస్పిటల్ లో దింపడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ యాదమ్మ విజయలక్ష్మి ఏ ఎన్ ఎం ఎస్ సుజాత జంగమ్మ ఫార్మసిస్ట్ రమేష్ అటెండర్ శ్రీనివాస్ కంప్యూటర్ ఆపరేటర్ ప్రశాంత్ ఆయ లింగమ్మ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు