ఉప్పలయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన డిసిబి చైర్మన్
నందనం సొసైటీ డైరెక్టర్ పద్మ కుటుంబాన్ని పరామర్శించిన మార్నేని
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డిసిబి చైర్మన్
అక్షర విజేత వర్ధన్నపేట
నందనం సొసైటీ డైరెక్టర్ బిర్రు పద్మ కుమారస్వామి పంతిని మాజీ ఎంపీటీసీ ముంజ చేరాలు మామయ్య ఉప్పలయ్య వర్ధన్నపేట మండలం నల్లబెల్లిలో గ్రామంలో సోమవారం అకాల మరణం చెందారు. సమాచారం అందుకున్న డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు ఉప్పలయ్య పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. సొసైటీ డైరెక్టర్ పద్మ కుమారస్వామి, ఎంపీటీసీ ముంజ చేరాలు కుటుంబ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ బిరు) దేవేందర్, బాబు, డాక్టర్ రామన్న లను ఓదార్చి, మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ పరామర్శలో సెర్ప్ సిసి గోలి కొమురయ్య ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బిర్రు మహేందర్ మాదిగ, బొక్కల నారాయణ మిద్దెపాక రవీందర్, మాజీ సర్పంచులు ముత్యం దేవేంద్ర సంపత్, దుగ్యాల జ్యోతి మాధవరావు వివిధ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…