నాటు సారాయి తయారీ స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
అక్షరవిజేత మహబూబాబాద్
పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు ఎక్సైజ్ సూపర్డెంట్ కిరణ్ ఆధ్వర్యంలో మహబూబాబాద్,కురవి మండలాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు.ప్రొహిబిషన్,ఎక్సైజ్ అధికారులు మహబూబాబాద్,కురవి మండలాల్లో గత రెండు రోజులుగా విస్తృతంగా దాడులు నిర్వహించామని ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ నీరజ తెలిపారు.ఈ దాడులలో ఐదుగురు వ్యక్తుల నుండి42లీటర్ల నాటు సారాయి రెండు క్వింటాల నల్ల బెల్లం13కేజీల పట్టిక స్వాదినపరుచుకొని ఐదు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ దాడులలో ఎస్సై కిరీటి సిబ్బంది వెంకన్న,నరసింహారావు,శ్రీను,జ్యోతి ఉమేష్ లు పాల్గొన్నారు.