అక్రమంగా భూమి ఆక్రమించిన కేసులో ఒకరికి జైలుశిక్ష
అక్షర విజేత మరిపెడ:-
మరిపెడబంగ్లాకు చెందిన ఒకరికి తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత ఒక సంవత్సరము జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు అని మరిపెడ ఎస్సై ఎస్.కె తహెర్ బాబా తెలిపినారు ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం
2014వ సంవత్సరంలో మరిపెడబంగ్లాకు చెందిన బండి వేణు తండ్రి సత్యం సర్వే నెంబరు 469 లో 151 గజాల భూమిలో ఇంటి నిర్మాణం చేస్తుండగా నాసర్ల ఎల మంచమ్మ భర్త వెంకయ్య అను ఆమె అడ్డుకోగా బండి వేణు 2014మరిపెడ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్సై ఆర్. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ అనంతరం కోర్ట్ లో చార్జ్ షీట్ దాఖలు చేశారు, కోర్ట్ లో సాక్ష్యాదారాలను ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.గణేష్ ఆనంద్ వాదించారుఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన తొర్రూరు జూనియర్ సివిల్ జడ్జి మట్ట సరిత నాసర్ల ఎల మంచమ్మకి
ఒక సంవత్సరము జైలు శిక్షతో పాటు 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు . కోర్ట్ కానిస్టేబుల్ రామ్ నారాయణ ను తొర్రూరు డీఎస్పీ సురేష్, సీఐ హతిరాం, ఎస్ఐ
తహేర్ బాబా అభినందించారు.