ఎంపీగా గెలిపించండి ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానుబి ఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి
మెదక్ జిల్లాలో గులాబీ జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే హరీష్ రావు
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
బి ఆర్ఎస్ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 25 సంవత్సరాలు కలెక్టర్ గా పనిచేసి 11 ఏళ్లు మెదక్ ఉమ్మడి జిల్లాలో పనిచేశానని, ఈ జిల్లాలో ప్రజలతో మమేకమై ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేశానని ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలోని నా పిల్లలు చదువుకున్నారని, తెల్లాపూర్ లో ఉండి ఇక్కడే ఓటు హక్కు కలిగి ఉన్నానని, ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిన కేసీఆర్ కు , హరీష్ రావు కు రాజకీయ జీవితం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజాదరణ ఉన్నది కాబట్టే నాకు ఎంపీ సీటు కేటాయించార ని, తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్ నెంబర్ వన్ ర్యాంకర్ అని, 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో సేవ చేశానని ఆయన తెలిపారు. అవసరం కోసం వచ్చిన ప్రజలను అక్కున చేర్చుకొని చూశానని ,వారి సమస్యలు పరిష్కరించానని ప్రజల్లో నాకు మంచి పేరు ఉందని తెలిపారు. ఐఏఎస్ చేసిన అధికారిగా చెప్తున్నాను రాబోయే రోజుల్లో ఎంపీగా ప్రజలకు మరింత మంచి సేవలు అందిస్తానని ప్రజల మనిషిగా ఉంటానని ఆయన తెలిపారు. ఎంపీగా గెలిచాక 100 కోట్లతో పివిఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తానని, ఏడునియోజకవర్గలలో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్ ఏర్పాటుచేసి కార్యకర్తలకు ఉచిత సేవలు అందిస్తానని తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని, మీ ఇంటి వ్యక్తిగా ఉంటూ మీ కష్టాల్లో తోడుగా ఉంటానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేసి కెసిఆర్కు బహుమతి గా ఇస్తానని తెలిపారు. మెదక్ పార్లమెంటు బిజెపి అభ్యర్థి మంచోడు కానీ దుబ్బాకలో మాత్రం గెలవలేడు ఎందుకని ప్రశ్నించాడు. ఆయన పనితీరు బాగాలేకనే కొత్త ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా 54 వేల ఓట్ల తో దుబ్బాక ప్రజలు గెలిపించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మంచివాడు పేద పిల్లల కోసం 100 కోట్లతో నిధి ఏర్పాటు చేయడం గొప్పతనం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ప్రజలను నమ్మించి గొంతు కోశారని, 90 రోజుల్లో రైతుబంధు అమలు చేస్తామని మాటిచ్చి ఇప్పటివరకు పూర్తిగా ఇవ్వలేదని ఆయన తెలిపారు. పెన్షన్లు, 24 గంటల విద్యుత్తు సరిగా అమలు చేయడం లేదంటూ ఆయన పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని, కాంగ్రెస్కు ఓటు వేస్తే హామీలు అమలు చేయకుండా ఒప్పుకున్నట్టు ఉన్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని, చోటే బాయ్ ,బడే బాయ్ రేవంత్ రెడ్డి మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడని, దేశంలో కాంగ్రెస్ ,బిజెపి ఒకటేనని ముస్లింలను ఏనాడు కేంద్ర మంత్రులుగా తీసుకోలేదని , కెసిఆర్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని చేశారని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు తోఫా కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. బిజెపి పై బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని, వాళ్లతో ఒప్పందం పెట్టుకుంటే ఈరోజు కవిత జైలుకు వెళ్లేవారుకాదు అని ఆయన కాంగ్రెస్ను ప్రశ్నించారు. నచ్చినోళ్లు జేబులో ,నచ్చనల్లు జైల్లో, ఉండాలి అన్నట్లుగా ఉన్నది బిజెపి వైఖరి. ప్రతిపక్ష పార్టీలపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు బిజెపి పార్టీ పూనుకుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ ఎప్పుడూ బిజెపితో కలిసేదిలేదని, మాది ఎప్పుడు సెక్యులర్ పార్టీ అని ఆయన తెలిపారు. దేశంలో 154 మెడికల్ కాలేజీలో ఇస్తే ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వలేదని, కెసిఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ ను ప్రజలు చిత్తుగా ఓడించాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని, రాష్ట్రంలో టిఆర్ఎస్కు పూర్వవైభవం తీసుకొస్తామని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మంది బిఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు.