Sunday, April 20, 2025
spot_img

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
…మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
అక్షర విజేత మోర్తాడ్ : రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన పంట కోతకు వచ్చిన దరిమిలా ప్రభుత్వం వెంటనే ఊరురా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెస్పీ రేటు పై రూ.500 బోనస్ కలిపి వరి ధాన్యం ను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి,బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం వేల్పూర్ మండల కేంద్రం లోని ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ మాట్లాడారు.అధికార దాహంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల గడువు ముగిసిందని ఇక సీ. ఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను నెరవేర్చలని, లేని పక్షంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదని అన్నారు. ఎద్దు ఏడ్చి ఎవుసము, రైతేడిచిన రాజ్యాం బాగుండదని చెప్పి బీయర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు పుష్కాలంగా సాగు నీరు,24 గంటల కరెంటు, రైతుబంధు, రైతు భీమా ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడ్డగోలు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో రైతుల పరిస్థితిని దయనీయంగా తయారు చేసిందని ఆయన ఆరోపించారు. 110 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగు నీరు సరిగా ఇవ్వక, కరెంట్ సరిగా ఇవ్వక కాలిపోతున్న ట్రాన్స్ ఫార్మర్లు, ఎండిపోయిన పంటలు, ఎత్తిపోయిన బోర్ మోటార్లతో రైతులకు దుఃఖన్నే మిగిల్చిందన్నారు.బీయర్ఎస్ ప్రభుత్వంలో 21 ప్యాకేజీ ట్రైయల్ రన్ ద్వారా కాళేశ్వరం నుండి నీటిని ఇచ్చి ఆదుకొన్నాదని గుర్తు చేశారు. సాగునీరు ఇవ్వాలని రైతులు అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోగా పైపెచ్చు ఎస్సారెస్పీ నుండి ఆలోకేషన్ కంటే ఎక్కవ నీరును కిందికి తరలించి ఇక్కడి రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ ప్రాంతం లో చాలా చెక్ డ్యాములు ఉన్నాయని,21 ప్యాకేజీ ద్వారా నీటి తో కప్పల వాగు, పెద్దవాగులు నింపి రైతులను ఆదుకోవాలని రైతు రోడ్డు ఎక్కి అడిగిన ప్రభుత్వం వాగులు నింపలేక పోయిందాని, వీటికి స్థానిక కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.సీ. ఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానలని కెసీయర్ పై అనిచిత వ్యాఖ్యలు సిగ్గు చేటు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు, సీ. ఎం స్వయంగా తీసుకొన్న గడువు 100 రోజులు ముగిసినందున వెంటనే రైతులకు ఇచ్చిన 24 గంట కరెంట్, రైతు భరోసా, ఎమ్మెస్పీ ధర పై బోనస్ తో వరి ధాన్యం కొనుగులు, రూ.2లక్షల ఋణ మాఫీ, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేసి ఓట్లను అడగాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఈ హామీలు, గ్యారంటీలను అమలు చేయాలని, ఎలక్షన్ కోడ్ పేరుచెప్పి తప్పించుకోవద్దని ఏద్దేవా చేశారు. మేము మీ లాగ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చెయ్యమని, రైతుల కోసం మీకు సహకరిస్తామని ఆయన అన్నారు. లేని పక్షంలో హామీల అమలు కోసం రైతులతో బీయర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని బీయర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలుస్తుందని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో బీయర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్లు, ఎంపీపీలు, జడ్పిటీసీలు, సొసైటీ చైర్మన్లు కోర్ కమీటీ సభ్యులు, మండల కమీటిల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles