నేడే ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు!! కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి, నవీన్ కుమార్ గుప్తా
అక్షర విజేత, శివంపేట.
నర్సాపూర్ నియోజకవర్గ ముద్దుబిడ్డ ఆవుల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి రాష్ట్ర టిపిసిసి ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతాయని. శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి మామిడి నవీన్ కుమార్ గుప్తా అన్నారు. ఇట్టి జన్మదిన వేడుకను విజయవంతం చేయవలసిందిగా మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పులిమామిడి నవీన్ కుమార్ గుప్తా యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.