రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆటో డ్రైవర్ కు బియ్యం వితరణ.
అక్షర విజేత అశ్వాపురం, మార్చి 26
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని చింతిర్యాల కాలనీ గ్రామానికి చెందిన జెట్టి సురేష్ అనే ఆటో డ్రైవర్ గత కొంతకాలం క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో విషయం తెలుసుకున్న అశ్వాపురం ఆటో యూనియన్ నాయకులు సురేష్ స్వగృహానికి వెళ్లి పరామర్శించి, 25 కేజీల బియ్యంను వితరణగా అందజేసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు భాగవతపు సతీష్, కొమ్ము రాంబాబు, మందా రాంబాబు, బోళ్ల రమణయ్య, మడిపల్లి రమేష్, కరకపల్లి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.