ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ
రైతులు తాము తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలి-
సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి.
అక్షర,విజేత నిజామాబాద్ ప్రతినిధి:
ధర్పల్లి మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో మంగళవారం రోజున చైర్మన్ చెలిమెల మల్లికార్జున్ అధ్యక్షతన మహాజన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈవో సంతోష్ రెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకు సంబంధించిన ఆదాయ, వ్యయాలు, ఇతర లావాదేవీలపై నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ. రైతులు తాము తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించాలని సొసైటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు.గతంలో తీసుకున్న రుణాలకు చెల్లిస్తే కొత్తగా రుణాలు తీసుకునే వారికి అవకాశం ఉంటుందని కావున రైతులు సకాలంలో రుణాలు చెల్లించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్త తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లసారిక రెడ్డి,సొసైటీ వైస్ చైర్మన్ గున్నయ్య, ప్రేమలత, సొసైటీ కార్యదర్శి సంతోష్ రెడ్డి, డైరెక్టర్లు పోతరాజు, శ్రీనివాస్, సలేహా బేగం, బాలు,మహేందర్, ప్రేమలత, విట్టల్, రమేష్, రఘు, నౌసీ, నాయకులు హనుమంత్ రెడ్డి, ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.