ఈ- పాస్ మెషిన్ ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలి
అక్షర విజేత మోర్తాడ్
మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలలో గల ఎరువుల, విత్తనాల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, భీంగల్ ఏ. డి .ఏ.మల్లయ్య, మోర్తాడ్ మండల ఏ.వో లావణ్య లు మంగళవారం మండలంలోని ఆయా గ్రామాలలో గల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ ప్రభుత్వఆదేశాల మేరకు ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు, ఎరువులు, విత్తనాలు, విక్రయించాలని ఆదేశించారు. ఈ పాస్ మిషన్ ద్వారా రైతులకు అందించకుంటే, సక్రమంగా ఈ పాస్ మిషన్ పథకాన్ని అమలు చేయకుంటే సీడ్స్ దుకాణాలపై కఠిన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అన్నారు కార్యక్రమంలో ఎరువుల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.