
అక్షర విజేత మరిపెడ
మరిపెడ మండల ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మరిపెడ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు గండి విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం సమావేశమై ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పర్వతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా మారం అనంతరాములు, కోశాధికారిగా బోడపట్ల సతీష్ గౌడ్ లను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రేఖ అశోక్, మూడవత్ రవి, సహాయ కార్యదర్శులుగా మాడు శ్రీకుమార్, బాశిపంగు వెంకన్నలను, గౌరవ సలహాదారులుగా దాసరోజు బాలకృష్ణ,వంకాయలపాటి తిరుమలరావు, కారంపూడి వెంకటేశ్వర్లును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం దిశగా పనిచేస్తూ, రిపోర్టర్ల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు.ఈ ఎన్నికలలో రిపోర్టర్లు గండి నాగరాజు,పులుసు సతీష్, దేవరశెట్టి శ్రీశైలం,బోడ శ్రీను,తిరుపతి, మహేందర్, చింతా వెంకన్న,ఉపేందర్, రాంపల్లి కపిల్,గందసిరి ఉప్పలయ్య, ఉప్పల రమేష్,బోడపట్ల వెంకన్న,తదితరులు పాల్గొన్నారు.