ఇజిఎస్ పనులపై ఇన్నర్ ఫోరంలో సామాజిక తనిఖీ
అక్షర విజేత కారేపల్లి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు సంబందించి కారేపల్లిలో ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం సామాజిక తనిఖీ ఎంపీ ఓ పర్వీన్ కైసర్ అధ్యక్షతన ప్రారంభమైంది. మండలంలో 41 గ్రామపంచాయతీలో సీతారాంపురం, చిన్నమడం పల్లి, ఉసిరికాయలపల్లి, గంగారం తండా,గుట్ట కింద పంపు, పోలంపల్లి, కొత్త కమలాపురం, పాత కమలాపురం,దుబ్బ తండా వెంకటయ్య తండా,కొత్త తండా, గేట్ కారేపల్లి, రేగుల గూడెం, భాగ్యనగర్ తండా అప్పాయిగూడెం, పంచాయతీలకు సంబంధించి నివేదికలను సమర్పించారు సామాజిక తనిఖీ బృందం ఆయా గ్రామాలలో పరిశీలించిన ఉపాధి పనులలో ఎన్నో అవకతవకలు బయటకొస్తున్నాయి. పనుల పర్యవేక్షణ నిర్వహణ రిజిస్టర్లు సక్రమంగా రాయకపోవడానికి సామాజిక బృందం గుర్తించారు అదేవిధంగా పలు గ్రామాల్లో జరిగిన పనులలో కొలతలు తేడాలలో గుర్తింపుతోపాటు ఇజిఎస్ పనులకు సంబందించి ఉపాధి హామీ కూలీల మస్టర్ల నిర్వహణ సరిగా లేనట్లు కనుగొన్నారు. కొన్ని పంచాయతీలలో నిర్వహించాల్సిన నిర్వహణ తీరు సరిగా లేనట్టు గమనించారు.14 పంచాయతీలకు సంబందించి పనుల నివేదికను అందజేసారు.సింగరేణి మండలంలో 41 గ్రామ పంచాయతీలు ఉండగా మిగిలిన గ్రామపంచాయతీలకు సంబంధించి బుధవారం సామాజిక తనిఖీ కొనసాగనున్నది ప్రధానంగా ఆయా పంచాయతీలలో సంబందిత కార్యదర్శులు తమ రికార్డులను సక్రమంగా రాయకపోవడంతో పాటు పరిశీలనకు వచ్చిన సామాజిక బృందం సభ్యులకు కార్యదర్శులు రికార్డులు అందజేయనట్లుగా గుర్తించారు. పంచాయతీలకు సంబందించి అధికారుల పర్యవేక్షణలో నివేదికలను పరిశీలించారు. హరితహారం పథకం కింద ప్రకృతివనాలు, ఎవెన్యూ ప్లాంటేషన్లో నాటిన మొక్కలకు సంబందించి మొక్కలు చనిపోయిన విషయాన్నిగుర్తించిన తనిఖీ బృందం నివేదికలకు అనుగుణంగా నూతన మొక్కలు నాటాలని తన డిఆర్డిఎ ఎడి శిరీష ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డిఓ బి శిరీష , ఏపీ డి శ్రీదేవి, ఏవివో పవన్,శాస్త్రి సురేందర్ ఏపీవో అజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శిలు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.