ప్రతి ఓటరు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
-బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్
అక్షర విజేత,మంచిర్యాల ప్రతినిధి
బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకునే విధంగా పట్టణంలో పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు పోలీసు వారి నియమ నిబంధన సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు, తమ ఓటు హక్కు ను వినియోగించుకుని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, సర్కిల్ ఎస్సైలు రాజశేఖర్, ఆంజనేయులు, ప్రవీణ్ కుమార్ లతో , పాటు 100 మంది కేంద్ర బలగాలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.