ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేని కలిసిన గడ్డం ఫ్యామిలీ
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి:
పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించడంతో మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ని చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకటస్వామి,వినోద్, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ లు మర్యాదపూర్వకంగా కలిశారు. గడ్డం వంశీకృష్ణకి ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దపల్లి ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలవాలని ఖర్గే వారికి సూచించినట్లు తెలిపారు.