అల్పోర్స్ కాలేజ్ కు అనుమతి లేకున్న అడ్మిషన్ లు—విద్యార్థులను చేర్చవద్ధంటున్న ఇంటర్మీడియట్ బొర్డు
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నగరంలో ప్రస్తుతం అల్పోర్స్ జూనియర్ కళాశాల ఎర్పాటు గురించి జోరుగా ప్రచారం జరగుతుంది. అల్పోర్స్ గ్రూప్ ఆప్ కాలేజేస్ కు సంబంధించిన కొత్త కళాశాల నిజామాబాద్ జిల్లాలో ఎర్పాటు చేసినట్లు జిల్లాలో పెద్ధ పెద్ధ హోర్డింగ్ లు, ప్లెక్సిలు, కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారు. అందులో కొత్తేముంది అంటే, ఇదివరకే ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ కేంద్రంగా ప్రారంభమైన అల్పోర్స్ కళాశాలల ప్రస్థానం హైద్రాబాద్, హన్మకోండ, జగిత్యాల్, మంచిర్యాల్, నిర్మల్ జిల్లాలో ఉండగా, నూతనంగా నిజామాబాద్ నగరంలో అడుగిడినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఐఐటి, నీట్, సివిల్ సర్విసేస్ లో బోదనకు మంచి కళాశాల అంటు ప్రచారం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ముబారక్ నగర్ లో కళాశాల ఎర్పాటు పై ప్రచారం చేస్తుండగా, అక్కడ ఎలాంటి భవనం కాని, సంబంధిత కార్యాలయం కనిపించదు. కేవలం ఫోన్ నంబర్ అధారంగా అంతా వ్యవహరం నడుస్తుంది. నిజామాబాద్ లోని ముబారక్ నగర్ లో నిర్మిస్తున్న నూతన భవనమే కొత్తగా జిల్లాలో ఎర్పాటు కానున్న అల్పోర్స్ కాలేజీ అని, మీరు ఎవ్వరు నమ్మిన నమ్మకపోయిన అదే కళాశాల భవనమని, సంబందిత కళాశాలకు పార్కింగ్ గురించి కాని, క్రిడా మైదానం గురించి మాత్రం అడగవద్ధని కళాశాల యజమాన్యం పేర్కొంటున్నారు. అక్కడే కొత్త కళాశాల తెరుస్తున్నామని, దాని పేరు మీదనే ప్రస్తుతం ప్రచారం జరుగుతంది. ఇంకా నిర్మాణ దశలో ఉండగానే అక్కడ కళాశాల ఎర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేసుకుని, తాజాగా అక్కడ టిచింగ్, నాన్ టిచింగ్ స్టాప్ ను రిక్రూట్ చేశారు. వారితో అడ్మిషన్ ల ప్రక్రియను ప్రారంభించారు. అయితే ఈ విషయం నిజామాబాద్ జిల్లా ఇంటర్మిడియట్ అధికారులకు తెలియదు. అల్పోర్స్ కళాశాల యజమాన్యం జిల్లాలో ఇటివల మూతబడిన ఓక ప్రైవేట్ జూనియర్ కళాశాల పేరు మీదనే ఫక్తు అడ్మిషన్ ల పర్వం ప్రారంభించారని, పేరు మార్పిడి అంతా బోర్డు ద్వార జరుపుతామని ప్రచారం చేస్తున్నారు. కానీ అల్పోర్స్ కళాశాలకు అనుమతి లేదని భవనం నిర్మాణం పూర్తి కాలేదని విషయం తెలియని అమాయక విద్యార్ధుల తల్లిధండ్రులను బురిడి కోట్టించి అడ్మిషన్ లను చేయించడం విశేషం. ప్రధానంగా పదో తరగతి పరిక్షలు రాస్తున్న విద్యార్ధులను బుట్టలో వేసుకునేందుకు పిఆర్ఓ లు, కమీషన్ ఎజేంట్ లను రంగంలోకి దించినట్లు ప్రచారం జరుగుతుంది. అల్పోర్స్ జూనియర్ కళాశాల ఎర్పాటు తతంగం అనుమతులు లేకుండా జరుగుతున్న విషయం తెలిసిన విద్యార్ధి సంఘాలు కోన్ని అందోళన చేసిన తరువాత కాలంలో మెత్త బడటం వేనుక మతలబు ఉందని ప్రచారం జరగుతుంది. అల్పోర్స్ కాలేజీకి ఇంటర్మిడియట్ గుర్తింపు లేదు… జిల్లా ఇంటర్మిడియట్ అధికారి రఘురాజ్ నిజామాబాదులో ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాల కు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ స్పష్టం చేశారు. పలు విద్యార్ది సంఘాల ఫిర్యాదు చేసిన మేరకు తాము పరిశీలన చేశామని, ఇంతవరకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుండి కానీ, జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయం నుండి కానీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు. ఆల్ ఫోర్స్ జూనియర్ కళాశాలకు అసలు ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేదని తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ షెడ్యూలు విడుదల అయిన తర్వాత గుర్తింపు పొందిన కళాశాలలో మాత్రమే చేర్పించాలని స్పష్టం చేశారు. కావున విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ప్రకటనలకు మోసపోరాదని జిల్లా ఇంటర్ విద్య అధికారి స్పష్టం చేశారు.