ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి నామానే
బిఆర్ఎస్ జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాస్
అక్షర విజేత కారేపల్లి
రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఖమ్మం పార్లమెంటు నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీలో ఉంటారని, ఎలాంటి అపోహలను కార్యకర్తలు నాయకులు నమ్మవద్దని జిల్లా నాయకులు బత్తుల శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఖమ్మం పార్లమెంటు నుండి గెలుపొందిన నామ నాగేశ్వరరావు తిరిగి ఈసారి పార్టీ తరపునుండే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. అనేకమంది నామా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని పార్టీ మారరని, కెసిఆర్ నామాను ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించారని అన్నారు. ఈసారి మరింత భారీ మెజార్టీతో ఆయన గెలుపొందడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చీమలపాడు మాజీ సర్పంచ్ మాలో త్ కిషోర్ పాల్గొన్నారు.